క్రైమ్

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

2 నిమిషాల పఠనం

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తోటి మహిళా ట్రైనీ IPSను లైంగికంగా వేధించారన్న ఆరోపణల కేసులో ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తోటి మహిళా ట్రైనీ IPSను లైంగికంగా వేధించారన్న ఆరోపణల కేసులో ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మహిళ ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం ఉదయ్ ని పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు. 67 రోజుల పాటు ఉదయ్ జైలులోనే గడిపాడు. విచారణ, వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేసు నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడింది.

కానిస్టేబుల్‌ నుంచి IPSగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే, జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఉదయ్ తనను లైంగికంగా వేధించాడు అంటూ తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఆమె ఫిర్యాదుతో ఉదయ్ కెరీర్ మసకబారింది. మహిళకు వాహం తర్వాత ఆమె భర్తకు ఉదయ్ సన్నిహిత వీడియోలు పంపాడన్న ఆరోపణలు ఉన్నాయి.

#Uday Krishna Reddy#Trainee IPS#Bail#National Police Academy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి