స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కల్తీగాళ్ల కక్కుర్తి.. పాల నుంచి స్వీట్ల దాకా అదే దారి! హైదరాబాద్ లో ఏం తినలేమా..?తెలంగాణSwechaa17 Nov 2026, 11:13 PM

కల్తీగాళ్ల కక్కుర్తి.. పాల నుంచి స్వీట్ల దాకా అదే దారి! హైదరాబాద్ లో ఏం తినలేమా..?

హైదరాబాద లో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. పాల నుంచి స్వీట్ల దాకా అంతటా కల్తీయే. తాాజాగా స్వీట్లపై వాడే సిల్వర్ ఫాయిల్ ను కూడా కల్తీ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు మహానగరంలో మనం ఏం తినలేమా..?

బదిలీ చేస్తే సరిపోదు, సజ్జనార్‌ను సర్వీస్ నుంచే తీసేయాలితెలంగాణSwechaa17 Nov 2026, 10:24 PM

బదిలీ చేస్తే సరిపోదు, సజ్జనార్‌ను సర్వీస్ నుంచే తీసేయాలి

IPS Sajjanar: సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తప్పించి వేరే విభాగానికి బదిలీ చేయడంతో సరిపెట్టకూడదని, ఆయన్ను సర్వీస్ నుంచే పూర్తిగా తొలగించాలని బీసీ మహిళా జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్టా డిమాండ్ చేశారు. సజ్జనార్ బదిలీపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సి.వి. ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇలాంటి అధికారులను కేవలం అటాచ్‌మెంట్ పోస్టులకు పరిమితం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుందని ఆమె స్పష్టం చేశారు.

Gold Insurance: లక్షలు పెట్టి కొన్న బంగారం పోతే ఎలా? ఈ ఒక్క బీమా తీసుకుంటే మీ నగలకు ఫుల్ సెక్యూరిటీ!వ్యాపారంSwechaa17 Nov 2026, 09:58 PM

Gold Insurance: లక్షలు పెట్టి కొన్న బంగారం పోతే ఎలా? ఈ ఒక్క బీమా తీసుకుంటే మీ నగలకు ఫుల్ సెక్యూరిటీ!

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, లక్షలు పోసి కొన్న నగలను ఇంట్లో దాచుకోవాలంటేనే సామాన్యులకు కంటి మీద కునుకు పట్టడం లేదు. ఊరెళ్లినా, ఇంట్లో ఉన్నా దొంగల భయం వెంటాడుతూనే ఉంటుంది. కారుకు, ఇంటికి, ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లే.. ఇప్పుడు మీ బంగారు ఆభరణాలకు కూడా గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ టెన్షన్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అసలు బంగారానికి బీమా ఎలా తీసుకోవాలి? ఏమైనా జరిగితే డబ్బులు ఎలా తిరిగి వస్తాయో వివరంగా తెలుసుకుందాం.

Tollywood: డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్న 4 చిత్రాలు..సినిమాSwechaa17 Nov 2026, 09:09 PM

Tollywood: డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్న 4 చిత్రాలు..

Tollywood: డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్న 4 చిత్రాలు. అయితే, వీటిలో ఏ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుంది..ఏ సినిమా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంటుంది..ఏది ఫ్లాప్ టాక్‌తో ట్రోల్స్ కి గురౌవుతుంది అన్నది వార్‌లో తేలిపోతుంది. కానీ, ఇప్పుడున్న సమాచారం మేరకు ఈ నాలుగు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటాయని తెలుస్తోంది.

TG : సోనియాగాంధీ ఆత్మలో, గుండెల్లో తెలంగాణ లేదు: కేటీఆర్తెలంగాణSwechaa17 Nov 2026, 08:42 PM

TG : సోనియాగాంధీ ఆత్మలో, గుండెల్లో తెలంగాణ లేదు: కేటీఆర్

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఆత్మలోనూ, గుండెల్లోనూ తెలంగాణ లేదని, అందుకే ఆమె ఆత్మకథలో రాష్ట్ర ప్రస్తావన కనిపించలేదని వ్యాఖ్యానించారు.

AP : ఏపీకి ‘అక్వాన్’ తుపాను గండం.. ఆ రెండు రోజులు బయటకు రావొద్దు!ఏపీSwechaa17 Nov 2026, 08:32 PM

AP : ఏపీకి ‘అక్వాన్’ తుపాను గండం.. ఆ రెండు రోజులు బయటకు రావొద్దు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు పెను గండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను.. గంటగంటకూ మరింత బలపడుతూ ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇవాళ రాత్రికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి ఉదయానికి ‘అతి తీవ్ర తుపాను’గా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

Nani-Nithin: "అలియాస్ రుక్మిణి" హిట్ ఇద్దరికీ చాలా అవసరం..సినిమాSwechaa17 Nov 2026, 08:07 PM

Nani-Nithin: "అలియాస్ రుక్మిణి" హిట్ ఇద్దరికీ చాలా అవసరం..

Nani-Nithin: టాలీవుడ్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా అలియాస్ రుక్మిణి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను దండోరా మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ కాంత్ దేవసోత్ రూపొందిస్తున్నాడు. అయితే, ఈ సినిమా సక్సెస్ నిర్మాతగా నానికి, హీరోగా నితిన్‌కి చాలా కీలకంగా మారింది.

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ ను వెంటనే అరెస్ట్ చేయాలితెలంగాణSwechaa17 Nov 2026, 08:07 PM

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

BJP: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ సదస్సులో ఓ విదేశీయుడు భారత దేశాన్ని విమర్శిస్తుంటే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికే దేశద్రోహమే అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీజీపికి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. విదేశీయుడి మీద ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని డీజీపీని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దేశ ద్రోహానికి పాల్పడ్డ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ లను వెంటనే అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకి తరలించాలని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

సీఎం రేవంత్ మాట నమ్మి రైతులు నష్టపోతున్నారుతెలంగాణSwechaa17 Nov 2026, 07:49 PM

సీఎం రేవంత్ మాట నమ్మి రైతులు నష్టపోతున్నారు

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి హరీశ్ రావు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ లో రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు పరిశీలించారు. వడ్లు మార్కెట్ లోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట నమ్మి సన్నాలు సాగు చేసినందుకు రైతులు నష్టపోతున్నారని వాపోయారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లను కూడా కొనే దిక్కు లేదన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో దళారులదే రాజ్యమైందన్నారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ జరిపి రైతులను ఆదుకోవాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు.

TG : సమ్మక్క సాగర్‌కు మోక్షం లభించనుందా?తెలంగాణSwechaa17 Nov 2026, 07:42 PM

TG : సమ్మక్క సాగర్‌కు మోక్షం లభించనుందా?

కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీ కట్టడం ఎప్పుడో పూర్తయింది.. కానీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఒక్క ఫర్మిషన్ రాక అందులో నీళ్లు నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఎట్టకేలకు తెలంగాణ సాగునీటి రంగంలో పెండింగ్‌లో ఉన్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపిస్తోంది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం ఫలించింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో వీరు జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో, ఎన్‌ఓసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

TG: తెలంగాణ కార్మిక శాఖలో ‘ఓఎస్డీ’ రాజ్యం.. బావమరిదికి సీఈఓ పీఠం, ఈడీ కేసుల నిందితులకు క్లీన్‌చిట్?తెలంగాణSwechaa17 Nov 2026, 07:04 PM

TG: తెలంగాణ కార్మిక శాఖలో ‘ఓఎస్డీ’ రాజ్యం.. బావమరిదికి సీఈఓ పీఠం, ఈడీ కేసుల నిందితులకు క్లీన్‌చిట్?

TG: తెలంగాణ కార్మిక శాఖలో ఇప్పుడు అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. రూల్స్ ప్రకారం నడవాల్సిన ప్రభుత్వ శాఖలో, మంత్రి కార్యాలయానికి చెందిన ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి పెత్తనం మితిమీరిందన్న ఆరోపణలు సచివాలయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అర్హతలు, సీనియారిటీని పక్కనపెట్టి తన బంధువులకు, తనకు కావాల్సిన వారికి కీలక పదవులు కట్టబెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ వివాదంలో అన్నింటికంటే సంచలనంగా మారిన అంశం బంధుప్రీతి. ఐఎంసీ బోర్డు సీఈఓగా తన సొంత బావమరిది ప్రమోద్ రెడ్డిని నియమించేందుకు ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు శాఖలో జోరుగా చర్చ నడుస్తోంది.

Nagarjuna: కింగ్ 100 నుంచి అప్‌డేట్స్ రావాల్సిందే..సినిమాSwechaa17 Nov 2026, 05:39 PM

Nagarjuna: కింగ్ 100 నుంచి అప్‌డేట్స్ రావాల్సిందే..

Nagarjuna: నాగార్జున నటిస్తున్న మైల్ స్టోన్ మూవీ "కింగ్ 100". కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత టబు మళ్ళీ ఈ సినిమాలో నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే, ఈ సినిమా నుంచి అక్కినేని అభిమానులు ఆశించిన అప్‌డేట్స్ రావడం లేదని చెప్పుకుంటున్నారు. నిజమే, ఈ సినిమాకి గట్టి పోటీ బాలయ్య నటిస్తున్న 'దాదా' సినిమా ఉంది. అలాంటప్పుడు అప్‌డేట్స్ రావాల్సిందే.

Telangana Congress: సొంత ప్రభుత్వంలో ఉంటూ అలాంటి వ్యాఖ్యలా? గాంధీ భవన్‌లో కొత్త టెన్షన్!తెలంగాణSwechaa17 Nov 2026, 05:37 PM

Telangana Congress: సొంత ప్రభుత్వంలో ఉంటూ అలాంటి వ్యాఖ్యలా? గాంధీ భవన్‌లో కొత్త టెన్షన్!

Telangana Congress: అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎప్పుడూ ప్రభుత్వ విజయాలను, తాము చేయబోయే అభివృద్ధి పనులను చెప్పుకుంటూ కార్యకర్తల్లో జోష్ నింపాలి. కానీ తెలంగాణ క్యాబినెట్‌లోని కొందరు సీనియర్ మంత్రులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఏకంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమన్నట్లుగా, తాను పోటీ చేయబోనన్నట్లుగా ఓ మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 365 మండలాలను ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి, ఎప్పుడూ మాట్లాడినట్లే కాస్త ఓపెన్‌గా తన అభిప్రాయాన్ని బయటపెట్టారట. "వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను" అని చెప్పడమే కాకుండా, అందుకు గల కారణాన్ని కూడా విశ్లేషించారట.

AutoStrikeNov30: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల హెచ్చరిక.. నవంబర్ 30న మహా బంద్‌కు పిలుపు!తెలంగాణSwechaa17 Nov 2026, 03:36 PM

AutoStrikeNov30: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల హెచ్చరిక.. నవంబర్ 30న మహా బంద్‌కు పిలుపు!

 ఆటో మీటర్ ఛార్జీలను సవరించడంతో పాటు డ్రైవర్ల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ (JAC) రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఇచ్చిన గడువులోగా డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 30న హైదరాబాద్ నగరంలో ఒక రోజు పూర్తి స్థాయి ఆటోల బంద్‌కు పిలుపునిచ్చింది. అవసరమైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.

Bharat Summit: భారత్ సమ్మిట్ బూమరాంగ్ అవుతుందా? కమలం పార్టీ కొత్త ప్లాన్ ఇదేనా!తెలంగాణSwechaa17 Nov 2026, 03:22 PM

Bharat Summit: భారత్ సమ్మిట్ బూమరాంగ్ అవుతుందా? కమలం పార్టీ కొత్త ప్లాన్ ఇదేనా!

Bharat Summit: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఒక సదస్సు, ఆ పార్టీకే తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జరిపిన ‘భారత్ సమ్మిట్’ ఇప్పుడు కొత్త రాజకీయ మంటలకు కేంద్రబిందువుగా మారింది. మోడీ సర్కార్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు గుప్పించడానికి కాంగ్రెస్ ఈ వేదికను వాడుకోవాలని చూస్తే.. ఇప్పుడు అదే సమ్మిట్‌లో జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బీజేపీ రివర్స్ గేమ్ మొదలుపెట్టింది. అసలు కాంగ్రెస్ ప్లాన్ బూమరాంగ్ అయ్యేలా కమలం పార్టీ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటంటే..ఈ మొత్తం వివాదానికి ఆ సభలో కొందరు విదేశీ ప్రతినిధులు చేసిన కామెంట్స్ ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా ఒక విదేశీ ప్రతినిధి వేదికపై నుంచి "ఓట్ చోర్ - గద్దె చోడ్" అంటూ భారత ప్రభుత్వంపై చేసిన విమర్శలు బీజేపీ చేతికి బలమైన ఆయుధంగా చిక్కాయి. మన దేశ అంతర్గత రాజకీయాలపై విదేశీయులతో విమర్శలు చేయించడమేంటని, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ వేదిక కల్పిస్తోందని ఆరోపిస్తూ కమలనాథులు ఎదురుదాడికి దిగారు.

KavithaOnInterBoardAbolition: ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదనపై కవిత ఫైర్.. రేవంత్ లెక్కలు తప్పంటూ ఘాటు విమర్శలు!తెలంగాణSwechaa17 Nov 2026, 03:10 PM

KavithaOnInterBoardAbolition: ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదనపై కవిత ఫైర్.. రేవంత్ లెక్కలు తప్పంటూ ఘాటు విమర్శలు!

 తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సంప్రదింపులు లేకుండా ఒంటెత్తు పోకడలతో ఇంటర్ బోర్డును రద్దు చేయాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.

Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్..సినిమాSwechaa17 Nov 2026, 03:03 PM

Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్..

Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్. అవును, ఇలా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్‌తో దాదాపు ఒకేసారి ఓ స్టార్ హీరో సినిమాలు మొదలైతే, ఆ కిక్కే నెక్స్ట్ లెవల్. ప్రస్తుతం, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే హెవీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇందులో, ఆయన పాత్ర చాలా సీరియస్‌గా సాగుతుంది. అయితే, ఈ సినిమా పూర్తి కాగానే ఇంచుమించు ఒకేసారి రెండు చిత్రాలు సెట్స్‌పైకి తీసుకురానున్నాడు తారక్.

Telangana Politics: ఇక కవితకు కౌంటర్లే.. ఆ భయంతోనే రూట్ మార్చిన బీఆర్ఎస్!తెలంగాణSwechaa17 Nov 2026, 02:52 PM

Telangana Politics: ఇక కవితకు కౌంటర్లే.. ఆ భయంతోనే రూట్ మార్చిన బీఆర్ఎస్!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొత్తగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత, ఇన్నాళ్లూ బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నా గులాబీ పార్టీ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇకపై కవిత వేసే ప్రతి బాణానికి అంతే బలంగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం డిసైడ్ అయింది. అసలు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గులాబీ దళం, సడన్‌గా ఎందుకు రూట్ మార్చింది? దీని వెనుక ఉన్న ఆ భయం ఏంటో తెలుసుకుందాం.ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల కంటే కవిత నుంచే బీఆర్ఎస్‌కు ఎక్కువ సెగ తగులుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.

KapilDevCommentsOnKohli: కోహ్లీ పదేళ్ల తర్వాత తప్పకుండా బాధపడతాడు: కపిల్ దేవ్క్రీడలుSwechaa17 Nov 2026, 02:44 PM

KapilDevCommentsOnKohli: కోహ్లీ పదేళ్ల తర్వాత తప్పకుండా బాధపడతాడు: కపిల్ దేవ్

 విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలోనే అత్యంత పెద్ద పొరపాటు చేశాడని టీమిండియా సీనియర్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ నుంచి కోహ్లీ అర్ధాంతరంగా తప్పుకోవడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదని, ఈ విషయంలో రాబోయే పదేళ్ల తర్వాత అతను తప్పకుండా తీవ్ర పశ్చాత్తాపపడతాడని కపిల్ అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ఫిట్‌నెస్, సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించే సత్తా పుష్కలంగా ఉన్నప్పటికీ కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని ఆయన స్పష్టం చేశారు.

Tollywood: 2027 జూలై నుంచి సెట్స్‌పైకి రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..సినిమాSwechaa17 Nov 2026, 02:34 PM

Tollywood: 2027 జూలై నుంచి సెట్స్‌పైకి రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..

Tollywood: మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ సినిమాపై తాజాగా సాలీడ్ అప్‌డేట్ వచ్చింది. ఆదర్శకుటుంబం ఫ్లాప్ వల్ల తారక్ ఈ సినిమాను హోల్డ్ చేశాడని..ఈ సినిమా ఉంటుందో? లేదో? అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఇటీవల వాటికి హారిక అండ్ హాసిన నిర్మాతతో కలిసి క్లారిటీ ఇచ్చారు గురూజీ.

Teachers : లీవ్ కావాలా? అటెండెన్స్ 95% ఉండాల్సిందే : హైదరాబాద్ కలెక్టర్తెలంగాణSwechaa17 Nov 2026, 02:14 PM

Teachers : లీవ్ కావాలా? అటెండెన్స్ 95% ఉండాల్సిందే : హైదరాబాద్ కలెక్టర్

ఉపాధ్యాయుల సెలవుల విషయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక జారీ చేసిన ఆదేశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సెలవులు కావాలంటే విద్యార్థుల హాజరు శాతం 95 శాతం ఉండాలని, లేదంటే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. అది కూడా అడిషనల్ కలెక్టర్ దగ్గర అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది.హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి లీవ్ లెటర్ ఇచ్చి మంజూరు చేయించుకోవడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ASEANIndiaSummit2026: దేశాల మధ్య పోటీ కంటే సహకారమే ముఖ్యం.. భారత్-ఆసియాన్ కలిసి సాగాలి: ప్రధాని మోదీNationalSwechaa17 Nov 2026, 01:53 PM

ASEANIndiaSummit2026: దేశాల మధ్య పోటీ కంటే సహకారమే ముఖ్యం.. భారత్-ఆసియాన్ కలిసి సాగాలి: ప్రధాని మోదీ

 ప్రస్తుత ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న తరుణంలో దేశాల మధ్య అనవసర పోటీ కంటే పరస్పర సహకారమే అత్యంత అవసరమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి, స్థిరత్వం, స్పష్టమైన విధానాలతోనే సురక్షిత భవిష్యత్తును నిర్మించుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా మంగళవారం నిర్వహించిన 23వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, ఆసియాన్ దేశాలు కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రాంతాన్ని ప్రపంచ శాంతికి నిలయంగా మార్చగలవని ఆయన పిలుపునిచ్చారు.

BJP : తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ.. నిధుల్లో భారీ కోత!తెలంగాణSwechaa17 Nov 2026, 01:45 PM

BJP : తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ.. నిధుల్లో భారీ కోత!

తెలంగాణలో అధికారంలోకి వస్తామని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, రాష్ట్ర కమలం నేతలు పదే పదే డప్పులు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రం మీద చూపిస్తున్న కపట ప్రేమ తేటతెల్లం అయ్యింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, జీఎస్‌టీ పరిహార గ్రాంట్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిసింది. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే రాష్ట్రానికి పెద్దగా ఎలాంటి ప్రయోజనం చేకూరినట్టు కనిపించడం లేదని పేర్కొంటున్నారు.రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లే మొత్తంలో సగం కూడా కేంద్రం నుంచి తిరిగి రావడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలంటే గౌరవం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల వలే సమానంగా అభివృద్ధి చేస్తామని పదే పదే చెప్పుకునే ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

SabarimalaMandalaPooja: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. రద్దీ నియంత్రణకు ఏఐ నిఘా!SpiritualitySwechaa17 Nov 2026, 01:38 PM

SabarimalaMandalaPooja: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. రద్దీ నియంత్రణకు ఏఐ నిఘా!

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం.. వృశ్చిక మాసం తొలిరోజైన మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు కొత్తగా నియమితులైన ప్రధాన అర్చకుడు(మేల్శాంతి) అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలను ప్రారంభించారు. అదే సమయంలో మాలికప్పురం అమ్మవారి ఆలయ ద్వారాలను కూడా ప్రధాన అర్చకుడు ఏ. దామోదరన్ నంబూద్రి తెరిచారు.

Yadadri : గురుకుల విద్యార్థినులకు లైంగిక వేధింపులు!తెలంగాణSwechaa17 Nov 2026, 01:15 PM

Yadadri : గురుకుల విద్యార్థినులకు లైంగిక వేధింపులు!

సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. రూ.500, 1000 ఇస్తాను.. వస్తారా? అని విద్యార్థినులను గత కొంతకాలంగా వంటమనిషి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం.యాదాద్రి జిల్లా అడ్డగూడూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో ఈ ఘటన వెలుగుచూసింది. సుమారు 20 మంది విద్యార్థినులను కీచక వంటమనిషి వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ విద్యార్థినులను బెదిరించినట్టు సమాచారం.బాధిత విద్యార్థినులు ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో గుట్టుచప్పుడు కాకుండా వంట మనిషిని ప్రిన్సిపాల్ పంపించివేసినట్టు తెలుస్తోంది.

Cm chandrababu : ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీపై చంద్రబాబు ఆగ్రహంఏపీSwechaa17 Nov 2026, 12:46 PM

Cm chandrababu : ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీపై చంద్రబాబు ఆగ్రహం

ఏపీలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని మామిడికుదురు మండలం, నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద గల ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ విషయం మీడియాలో రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.గ్యాస్ లీకేజీ జరిగిన సమీప ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కోనసీమలో ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష జరపాలని, ఈ విషయంపై ఓఎన్‌జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో వెంటనే మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.

GoldSilverRatesNov17: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!వ్యాపారంSwechaa17 Nov 2026, 12:38 PM

GoldSilverRatesNov17: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!

 దేశీయ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ, ప్రపంచవ్యాప్త సరఫరా వ్యవస్థలో హెచ్చుతగ్గులు పసిడి, వెండి రేట్లను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. కార్తీక మాసం, శుభకార్యాల సీజన్ కొనసాగుతున్న తరుణంలో ధరలు కొంతమేర దిగిరావడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.

No salaries : ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 5 నెలలుగా జీతాలు బంద్!తెలంగాణSwechaa17 Nov 2026, 12:29 PM

No salaries : ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 5 నెలలుగా జీతాలు బంద్!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. టీచర్లు, ఆయాలకు స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే జీతాలు ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ ఏడాది 1,032 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలలో రూ.8 వేల జీతంతో ఒక బోధకుడు, రూ.6 వేల జీతంతో ఒక ఆయాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని నియమించి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క నెల జీతం కూడా రాలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఎప్పటికైనా డబ్బులు రాకపోతాయా? అని కొన్ని నెలల పాటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారికి స్వయంగా జీతాలు చెల్లించినట్టు తెలిసింది.

Dhanush-O.M: సెన్సార్ పూర్తి చేసుకున్న మల్టీస్టారర్..సినిమాSwechaa17 Nov 2026, 12:14 PM

Dhanush-O.M: సెన్సార్ పూర్తి చేసుకున్న మల్టీస్టారర్..

Dhanush-O.M: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మల్టీస్టారర్ మూవీ ఓం. నవంబర్ 20న భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓం చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కంటెంట్‌ను బట్టి సెన్సార్ వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు.

TelanganaLandResurvey: భూముల రీసర్వేలో ఎక్కువ విస్తీర్ణం తేలితే..? రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు!తెలంగాణSwechaa17 Nov 2026, 12:09 PM

TelanganaLandResurvey: భూముల రీసర్వేలో ఎక్కువ విస్తీర్ణం తేలితే..? రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు!

 తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యవసాయ, సర్కారు భూముల సమగ్ర రీ సర్వే(LandResurvey)పై రాష్ట్ర రెవెన్యూ శాఖ అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రీ సర్వే కొలతల్లో ఏ రైతుకైనా పాసుపుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ విస్తీర్ణం తేలితే, ఆ అదనపు భూమిని తమదేనంటూ ఎవరూ యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేయడానికి వీలేదని నిబంధనల్లో తేల్చిచెప్పింది. సర్వే ముగిసిన అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. రికార్డుల కంటే అదనంగా ఉన్న విస్తీర్ణాన్ని సదరు రైతుల నుంచి వెనక్కి తీసుకుని, నిబంధనల ప్రకారం అర్హులై భూమి తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న ఇతర రైతులకు చట్టబద్ధంగా సర్దుబాటు చేయాలని రెవెన్యూ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.