తెలంగాణ

ఒక్క ఇంచు కొన్నా వదిలిపెట్టం.. వెనక్కి తీసుకుంటాం-పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వార్నింగ్

4 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు, సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో అమ్ముకోవడమే తప్పా రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని పరోక్షంగా సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు, సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో అమ్ముకోవడమే తప్ప.. రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని విరుచుకుపడ్డారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మరికొంతమంది కారు ఎక్కగా.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. ‘అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది’ అంటూ ఎద్దేవా చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

మియాపూర్ భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా పెడితే ప్రముఖ న్యాయవాదిని పెట్టి కేసు వాదించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ఆ భూమి ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. అయితే, తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు అమ్మేస్తున్నా అని చెబుతున్నారని మండిపడ్డారు.

హిల్ట్ పాలసీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో 10వేల ఎకరాలను పారిశ్రామికవేత్తలకు అమ్ముతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆశపడి హిల్ట్ పాలసీలో భూములు కొంటే అనుభవిస్తారని హెచ్చరించారు. ఏడాదిలోపు కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటికీ చెక్ పెడతామన్నారు. మా ప్రభుత్వం భూములన్నీ వెనక్కి తీసుకుంటుందన్న కేటీఆర్.. ఒక్క ఇంచు కొన్నా వదిలిపెట్టం అని పారిశ్రామికవేత్తలకు వార్నింగ్ ఇచ్చారు.

మియాపూర్‌లో 550 ఎకరాల భూములు ప్రభుత్వానివిగా డిక్లేర్ అయ్యాక అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ఆ భూముల్లో 200 ఎకరాల్లో పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టిస్తే తాము గొప్పగా స్వాగతిస్తామన్నారు.

#KTR#BRS#Congress#joinings#sherilingampally#cm revanthreddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి