తెలంగాణ

Congress : నేను రెడీ.. నువ్వు సిద్ధమా? కేటీఆర్‌కు దానం ఓపెన్ సవాల్

4 నిమిషాల పఠనం

ఖైరతాబాద్ ఉపఎన్నిక‌పై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ వరుసగా బై పోల్ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బైపోల్ నిర్ణయం హైకోర్టు పరిధిలో ఉన్నది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో దానం నాగేందర్‌‌ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఖైరతాబాద్ ఉపఎన్నిక‌పై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ వరుసగా బై పోల్ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బైపోల్ నిర్ణయం హైకోర్టు పరిధిలో ఉన్నది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో దానం నాగేందర్‌‌ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయగా.. ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధపడింది.అయితే, 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన విజయారెడ్డి.. దానం నాగేందర్ తన ఫ్యామిలీ,ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుగా చూపించారని.. ఆయన్ను డిస్ క్వాలిఫై చేయాలని పిటిషన్ గతంలోనే దాఖలు చేయగా.. దాని మీద తుదితీర్పు రాకుండా ఉపఎన్నిక నిర్వహించకుండా స్టే తీసుకొచ్చింది.

అయితే, కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓపెన్ సవాల్ విసిరారు.గురువారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీకి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో తనపై బరిలోకి దిగి పోటీ చేయాలని కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

ఉపఎన్నికకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుందామన్నారు. దానం నాగేందర్ అంటేనే ఓ బ్రాండ్ అని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాబోతోందని సంచలన కామెంట్స్ చేశారు. అదేవిధంగా ఎస్ఐఆర్ (SIR) విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపైనా దానం స్పందించారు.

ఈ నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్కరే కాకుండా, ఇండియా కూటమి ఎంపీలు,యువత పెద్దఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. ప్రజల ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఖైరతాబద్ ఉపఎన్నికలో తప్పకుండా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నిక ద్వారా ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టంచేశారు.కాగా, ఖైరతాబాద్ బై ఎలక్షన్‌లో దానం నాగేందర్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

#Danam nagender#by election#kairatabad#congress#KTR#BRS#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి