తెలంగాణ

KTR: కేటీఆర్‌కు అస్వస్థత.. 2 రోజుల పాటు పర్యటనలు రద్దు!

3 నిమిషాల పఠనం

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్(KTR) తీవ్రమైన వైరల్ ఫీవర్, ఫ్లూ తరహా లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలానుగుణంగా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ఆయన ఒక్కసారిగా తీవ్ర నీరసం, జ్వరం బారిన పడ్డారు. అస్వస్థతకు గురికావడంతో తక్షణమే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు కేటీఆర్ స్వయంగా వెల్లడించారు.

 ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని నిర్ధారించిన వైద్య నిపుణులు, ఆయనను ఇంటి వద్దనే ఉండి అవసరమైన పూర్తిస్థాయి చికిత్స, మందులు తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు కేటీఆర్ రాబోయే రెండు రోజుల పాటు ఇంటి వద్దే ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా తన రోజువారీ రాజకీయ కార్యక్రమాలకు, ముందస్తుగా నిర్ణయించిన వ్యక్తిగత షెడ్యూళ్లకు ఆయన తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

 వైద్యుల సూచనలు పాటిస్తూ అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, తిరిగి ప్రజాక్షేత్రంలో రోజువారీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

 కేటీఆర్ హఠాత్తుగా అస్వస్థతకు గురైన వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఆయన మద్దతుదారుల్లో కొంత ఆందోళన కలిగించింది. అయితే, ప్రస్తుతం ఇంటి వద్దే అందుతున్న వైద్య చికిత్స తీసుకుంటున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆయనకు విశ్రాంతి అవసరమైనందున నేతలు, కార్యకర్తలు ఎవరూ పరామర్శల పేరుతో డిస్టర్బ్ చేయవద్దని కోరాయి.

#KTR#KTRViralFever#KTRHealthUpdate#BRSParty#TelanganaNews#KTRRest#TelanganaPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి