క్రైమ్

ప్రియుడే హంతకుడు.. నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో వీడిన మిస్టరీ

4 నిమిషాల పఠనం

Harini Mystery: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో తీవ్ర సంచలనం రేపిన హరిణి మర్డర్ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడే హంతకుడు అని తేల్చారు. తనను దూరం పెడుతోందని, పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ప్రియుడు పవన్ కుమార్ హరిణిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

* తీవ్ర సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య

* ప్రియుడే హంతకుడు

* పెళ్లికి నిరాకరించిందని మర్డర్

* నిందితుడు పవన్ కుమార్ అరెస్ట్

Harini Mystery: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో తీవ్ర సంచలనం రేపిన హరిణి మర్డర్ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడే హంతకుడు అని తేల్చారు. తనను దూరం పెడుతోందని, పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ప్రియుడు పవన్ కుమార్ హరిణిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. జూలూరుపాడులో పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగన్నపాలెంలో సెప్టెంబర్ 22న హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పవన్ ఆమెను మర్డర్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు తెలిపారు.

మృతురాలు హరిణి, నిందితుడు దేవరకొండ పవన్ కుమార్ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పవన్ ప్రవర్తన నచ్చకపోవడం, క్యారెక్టర్ బాగోలేకపోవడంతో హరిణి అతడిని దూరం పెట్టింది. పవన్ తాగుబోతు, తిరుగుబోతు, ఎఫైర్స్ ఉన్నాయని తెలిసి సెప్టెంబర్ 4వ తేదీ నుంచి హరిణి అతడితో మాట్లాడటం మానేసింది. అంతేకాదు తన ఇన్ స్టాగ్రామ్ ఐడీని కూడా మార్చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

హరిణి తనను దూరం పెట్టడాన్ని, ఐడీ మార్చేయడాన్ని పవన్ తట్టుకోలేకపోయాడు. హరిణిని ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. 22న హరిణి ఇంటికి వెళ్లిన పవన్.. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి ఆమెతో గొడవపడ్డాడు. మాటమాట పెరగడంతో ఆగ్రహానికి గురైన పవన్.. ప్లాన్ ప్రకారం తనతో తెచ్చుకున్న బైక్ బ్రేక్ వైరుతో హరిణి మెడకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేశారు. కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో హంతకుడిని గుర్తించారు. నిందితుడి నుండి బైక్, బైక్ గేర్ వైర్, రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఒకటి హరిణికి చెందినదని తెలిపారు.

#Nursing Student#Harini Mystery#Harini Murder#Khammam#Vengannapalem Village#Julurupadu mandal#Kothagudem#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి