2014కు ముందు ఇళ్ల పథకం లబ్దిదారులకు భారీ ఊరట
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు ఇళ్ల పథకం లబ్దిదారులకు భారీ ఊరట కల్పించింది. ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్ల తిరిగి ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. తహశీల్దార్ ఆఫీసుల్లో ఉన్న ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు తిరిగివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. 22ఏ భూముల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. ఈ పట్టాల కోసం లబ్దిదారులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది.
