National
ASEANIndiaSummit2026: దేశాల మధ్య పోటీ కంటే సహకారమే ముఖ్యం.. భారత్-ఆసియాన్ కలిసి సాగాలి: ప్రధాని మోదీ
ప్రస్తుత ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న తరుణంలో దేశాల మధ్య అనవసర పోటీ కంటే పరస్పర సహకారమే అత్యంత అవసరమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి, స్థిరత్వం, స్పష్టమైన విధానాలతోనే సురక్షిత భవిష్యత్తును నిర్మించుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా మంగళవారం నిర్వహించిన 23వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, ఆసియాన్ దేశాలు కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రాంతాన్ని ప్రపంచ శాంతికి నిలయంగా మార్చగలవని ఆయన పిలుపునిచ్చారు.
