తెలంగాణ

Telangana Congress: సొంత ప్రభుత్వంలో ఉంటూ అలాంటి వ్యాఖ్యలా? గాంధీ భవన్‌లో కొత్త టెన్షన్!

Telangana Congress: అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎప్పుడూ ప్రభుత్వ విజయాలను, తాము చేయబోయే అభివృద్ధి పనులను చెప్పుకుంటూ కార్యకర్తల్లో జోష్ నింపాలి. కానీ తెలంగాణ క్యాబినెట్‌లోని కొందరు సీనియర్ మంత్రులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఏకంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమన్నట్లుగా, తాను పోటీ చేయబోనన్నట్లుగా ఓ మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 365 మండలాలను ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి, ఎప్పుడూ మాట్లాడినట్లే కాస్త ఓపెన్‌గా తన అభిప్రాయాన్ని బయటపెట్టారట. "వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను" అని చెప్పడమే కాకుండా, అందుకు గల కారణాన్ని కూడా విశ్లేషించారట.