తెలంగాణ

కొత్త సీపీ రాకతో పోలీసుల్లో టెన్షన్‌.. బదిలీల ప్రకంపనలు తప్పవా?

 నగరంలో పోలీస్‌ బాస్‌ మారడంతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే సజ్జనార్‌ను బదిలీ చేస్తూ కొత్త పోలీసు కమిషనర్‌గా మహేశ్‌ భగవత్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో, ఎప్పుడు ఎలాంటి బదిలీ ఉత్తర్వులు వెలువడతాయోనన్న భయం అధికారులను వేధిస్తోంది. ముఖ్యంగా కీలక జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే పలుమార్లు స్టేషన్లు మారాల్సి వస్తోందని, ఒక ప్రాంతంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించేలోపే బదిలీలు కావడం వల్ల విధులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నామని కొందరు అధికారులు మదనపడుతున్నారు.