తెలంగాణ

TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్

3 నిమిషాల పఠనం

TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడానికి మార్గం సుగమమైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ సర్కార్ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభ కార్యదర్శి తిరుపతి పేరిట సెప్టెంబర్ 26వ తేదీతో ఈ గెజిట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్‌పై కోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ అనర్హత అమలులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది.

ఈ ఆదేశాల ఆధారంగానే అప్పటి నుంచే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ గెజిట్‌లో పేర్కొంది. అసెంబ్లీ నుంచి గెజిట్ బయటికి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం చేరింది. దీంతో త్వరలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉండటంతో, నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప సమరానికి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి.

#Telangana#TG News#Khairatabad#Khairatabad By Election#Telangana By Election#Gazette Notification#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి