సినిమా

Tollywood: సినిమా తీయాలంటే 100 కోట్లు సరిపోదా?

5 నిమిషాల పఠనం

Tollywood: ఒక సినిమా తీయాలంటే అసలు బడ్జెట్ ఎంత కావాలి.? కాస్త నిశితంగా ఆలోచిస్తే చాలామందికి ఈ మధ్య కాలంలో వస్తోన్న అతిపెద్ద సందేహం. దీనికి కారణం, పాన్ ఇండియా సినిమా తీశామంటూ ప్రభుత్వాలను అడిగితే, ఒక్కసారిగా థియేటర్స్‌లో షోకి టికెట్ రేట్లను పెంచుకోమంటూ జీవో జారీ చేస్తున్నారు.

Tollywood: ఒక సినిమా తీయాలంటే అసలు బడ్జెట్ ఎంత కావాలి.? కాస్త నిశితంగా ఆలోచిస్తే చాలామందికి ఈ మధ్య కాలంలో వస్తోన్న అతిపెద్ద సందేహం. దీనికి కారణం, పాన్ ఇండియా సినిమా తీశామంటూ ప్రభుత్వాలను అడిగితే, ఒక్కసారిగా థియేటర్స్‌లో షోకి టికెట్ రేట్లను పెంచుకోమంటూ జీవో జారీ చేస్తున్నారు. మొదటి మూడు రోజులు గానీ, పేయిడ్ ప్రీమియర్స్ గానీ చూసేది ఆయా హీరోల అభిమానులే. కానీ, అభిమాని జేబుకే చిల్లు పడుతోంది.

100 కోట్లు ఒక సినిమాకి సరిపోవడం లేదు. ప్రస్తుతం, దర్శకు-హీరోలు పాన్ ఇండియా స్కేల్ మీద సినిమా తీస్తున్నారు. కథలో సహజత్వమే ఉంటోంది. దానికి, గ్రాఫిక్స్..వీఎఫెక్స్ అనే అదనపు హంగులను జోడించి 150..200..300 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సాధారణంగా ఒక అడ్డ మీద కూలికి ఇప్పుడు ప్రతీ రోజూ పని దొరకని పరిస్థితి. ఒకవేళ దొరికితే ఆ రోజు అతని కూలి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకూ ఉంటుంది.

అలాంటప్పుడు, పాన్ ఇండియా సినిమా చూడాలంటే అది కూడా మల్టీప్లెక్స్‌లో ఒక వ్యక్తి ఎంత ఖర్చు చేయాలి..అదే వ్యక్తి తన ఫ్యామిలీతో వెళితే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టే, అన్నీ పాన్ ఇండియా సినిమాలు హిట్ అవడం లేదు. కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి, బలగం, లాంటి చిన్న బడ్జెట్ సినిమాలే వంద కోట్లు కలెక్షన్స్ తీసుకొస్తున్నాయి. 150 కోట్లతో తీసిన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది లాభమా నష్టమా.. అని నిర్మాతను అడిగితే సూటిగా లాభం తెచ్చిన సినిమా అని చెప్పలేకపోతున్నాడు. దీనికి, కారణం ఫైనాన్స్, వడ్డీ, జీఎస్టీ రూపంలోనే సగం డబ్బు వెళ్లిపోతుంది.

హీరోకి రెమ్యునరేషన్ పెంచితే నష్టాలేనా?

ఇక్కడ సినిమా ఆడాలంటే ఖచ్చితంగా కావాల్సింది బలమైన కథ. ఆ తర్వాత హీరో మార్కెట్. హీరోకి ఉన్న క్రేజ్ ని బట్టి బిజినెస్ జరిగితే..కథలో ఉన్న దమ్మును బట్టి లాభాలు వస్తాయన్నది 100కి 100 శాతం ఒప్పుకొని తీరాల్సిన విషయం. అలాంటప్పుడు హీరోకి ఒక్కసారిగా 10 నుంచి 15 కోట్ల వరకూ రెమ్యునరేషన్ పెంచడం ఎందుకు..లేదా లాభాలలో వాటా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు..? అన్నది ప్రశ్నించుకోవాల్సి ఉంది.

హీరోలే మారాలా?

నందమూరి బాలకృష్ణ లాగా "నాకున్న మార్కెట్ పరిధిని బట్టే సినిమా బడ్జెట్ ఉండాలని".. నిర్మాతలకి చెప్పినట్టుగా ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్‌టిర్, చరణ్ లాంటి స్టార్స్ గనక ఈ విషయంలో చొరవ తీసుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తయారయ్యే అవకాశం ఉంటుంది. కానీ, హీరో రెమ్యునరేషనే ఇక్కడ 100 కోట్లు అంటున్నారే..మరి, ఒక్క పాన్ ఇండియా సినిమా పోతే నిర్మాత గుండెపోటుతో పోతాడు కదా? సినిమా నిర్మాణంలో రామానాయుడు లాంటి వారు..ఈ కథకి ఇంతే బడ్జెట్..అని దర్శకుడికి తేల్చి చెప్పేవారు. కాబట్టి, అప్పట్లో వచ్చిన సినిమాలు..వాటితో వచ్చిన లాభాలూ..వాటితో తీసిన మరికొన్ని సినిమాలు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. కానీ, ఇప్పుడు చెప్పేవన్నీ మ్యాజిక్ ఫిగర్సే తప్ప..మ్యాన్యువల్ ఫిగర్స్ కాదు. కాబట్టే, 10 సినిమాలు వస్తే 9 ఫ్లాపవుతున్నాయి.

#Tollywood#Balakrishna#Prabhas#Allu Arjun#Ram Charan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి