క్రైమ్

DSPBheemReddy: దేశంలోనే తొలిసారి.. భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కీల‌క ప‌రిణామం!

5 నిమిషాల పఠనం

సస్పెండైన తెలంగాణ మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు వేగాన్ని పుంజుకున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న విచారణకు తోడుగా తాజాగా ఐటీ సైతం ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా వ్యవహరించినట్లు బలమైన ఆధారాలు లభించిన 8 మందిపై 'బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్' కింద ఐటీ శాఖ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

అక్రమాస్తుల వ్యవహారంలో సస్పెండైన తెలంగాణ మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో దర్యాప్తు సంస్థలు వేగాన్ని పుంజుకున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న విచారణకు తోడుగా తాజాగా ఐటీ సైతం ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా వ్యవహరించినట్లు బలమైన ఆధారాలు లభించిన 8 మందిపై 'బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్' కింద ఐటీ శాఖ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే ఈ స్థాయి అధికారి బినామీ నెట్‌వర్క్‌పై బినామీ చట్టం కింద ఈ తరహా కేసులు నమోదు కావడం అత్యంత అరుదైన పరిణామంగా అధికారులు పేర్కొంటున్నారు.

డీజీపీ కార్యాలయ పరిధిలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన సమయంలో భీమ్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు ప్రాథమిక కేసు నమోదు చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.200కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, విల్లాలు, భారీ బ్యాంకు డిపాజిట్లను దర్యాప్తు బృందాలు సీజ్ చేశాయి. అయితే, విచారణ పురోగమించే కొద్దీ, పలు ఆస్తులు భీమ్‌రెడ్డి ప్రత్యక్ష పేరుతో కాకుండా ఇతరుల పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఈ క్రమంలోనే భీమ్‌రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ వెంకటేష్‌తో పాటు మరో ఏడుగురు అనుమానిత బినామీల ఇళ్లపై ఏసీబీ, ఐటీ బృందాలు ఉమ్మడిగా సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని పుప్పాలగూడతో పాటు జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిపిన మెరుపు దాడుల్లో రూ.1.35కోట్ల అకౌంటెడ్ నగదు, 14 లీటర్ల విదేశీ మందు, పలు రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ కాగితాలు లభ్యమయ్యాయి. ఈ ఆధారాల వెలుగులోనే, ఐటీ శాఖ బినామీ చట్టాన్ని ప్రయోగించి ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన అసలు నిధుల మూలాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

బినామీ చట్టం కింద ఆరోపణలు నిరూపితమైతే ఆయా ఆస్తులన్నింటినీ ప్రభుత్వం శాశ్వతంగా జప్తు (ఫర్ఫీచర్) చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, దాదాపు 57 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌‌లో ఉన్న భీమ్‌రెడ్డి సెప్టెంబర్ 1న బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కోణంలో సమాచారాన్ని సేకరిస్తోంది. ఏసీబీ, ఐటీ, ఈడీ త్రయం ఒకేసారి రంగంలోకి దిగడంతో భీమ్‌రెడ్డితో పాటు ఆయన వెనుకున్న బినామీ నెట్‌వర్క్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

#DSPBheemReddy#TelanganaACB#ITDeptAction#BenamiActCase#DAcaseHyderabad#TelanganaCrimeNews#EnforcementDirectorate
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి