తెలంగాణ

TG : తెలంగాణలో రూ.50 వేల కోట్ల దోపిడీ!

5 నిమిషాల పఠనం

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

- రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న సీఎం రేవంత్ ఫ్యామిలీ

- గతంలో అప్పులు.. ఇప్పుడు మాత్రం లాభాలు

- రూ.వేల కోట్లకు పడగలెత్తిన ‘ఎనుముల’ కుటుంబం

- రెండున్నరేండ్లలోనే రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన వైనం

- సీఎం రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు.అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, ఆయన కుటుంబం రూ.వేల కోట్లు దోచేసిందని సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రెండున్నరేండ్లలో ఎనుముల కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకున్న సొమ్ము అక్షరాలా రూ.50 వేల కోట్లు అంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. సీఎం పదవిని వాడుకుని రేవంత్ రెడ్డి తెలంగాణను లూటీ చేస్తున్నారని విరుచుకుపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.

కంపెనీల్లో సీఎం ఫ్యామిలీ పెట్టుబడులు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో సీఎం కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు అమాంతం విస్తరించాయని బీఆర్ఎస్ ఆరోపించింది. పలు సంస్థలకు ముఖ్యమంత్రి కుటుంబంతో సంబంధం ఉందంటూ ఆయా సంస్థల వివరాల జాబితాను సోషల్ మీడియాలో పెట్టింది. మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బీఎన్ ఫార్మా, గీతా ఆటోమోటివ్స్, టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, స్వచ్ఛ బయో, శోదా కన్‌స్ట్రక్షన్స్, మైండ్ వాల్ట్ కన్‌స్ట్రక్షన్స్ (స్కూల్స్) వంటి సంస్థలు వేగంగా అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ కంపెనీలు భారీ అవకతవకలకు పాల్పడుతున్నాయని దీనికి సంబంధించిన పత్రాలను ఈడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయాలతో పాటు ప్రతిపక్ష నేతలకూ అందజేస్తామని తెలిపింది.

రేవంత్ స్పందిస్తారా?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలో సీఎం రేవంత్, ఆయన కుటుంబం రూ.50వేల కోట్లు దోచేసిందంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. తన గురించి, తన కుటుంబం గురించి బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు.ఈ ఆరోపణలను ఏ విధంగా తిప్పికొడతారన్నది ఆసక్తికరంగా మారింది.మొత్తంగా ఈ లూటీ వ్యవహారం రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

#curruption#Telangana#rs.50thousand crores#cm revanth family#BRS
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి