జాతీయం

National : సీఈసీపై విజిలెన్స్ విచారణ.. కేరళం సర్కార్ ఆదేశం

4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకారం అందిస్తున్నదని, తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు డిలీట్ చేసే ప్రక్రియలో కేంద్రానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సాయం చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకారం అందిస్తున్నదని, తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు డిలీట్ చేసే ప్రక్రియలో కేంద్రానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సాయం చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ‘సత్యాగ్రహ’ దీక్షకు పిలుపునిచ్చారు. మరోవైపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.ఈ మేరకు నిన్న మహారాష్ట్రలో పెద్దఎత్తున నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా సీజేపీకి మద్దతుగా పలువురు నిరసన చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలాఉండగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు తాజాగా కేరళం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.2006లో ఆయన కేరళం ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా పనిచేశారు. నాడు పలు అవకతవకలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరపాలని హోంమంత్రి రమేశ్ చెన్నిథాల విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు. కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (KSTP) కింద ఎంసీ రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించిన 'పాటి-బెల్' ఇండో-మలేషియన్ కన్సార్టియంకు చెందిన ప్రాజెక్ట్ మేనేజర్, మలేషియా సివిల్ ఇంజనీర్ లీ సీ బీన్ 2006లో ఆత్మహత్య చేసుకున్నారు.

పీడబ్ల్యూడీ అధికారుల వేధింపులే తన మరణానికి కారణమని లీ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అందులో జ్ఞానేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. అప్పట్లో దీనిపై విజిలెన్స్ విచారణ జరిగినా రాజకీయ జోక్యం కారణంగా దర్యాప్తు జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు బయటి శక్తులు ప్రభావం చూపాయన్న ఫిర్యాదులు సైతం వచ్చాయి.

దీంతో ఈ కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని హోంమంత్రి రమేశ్ చెన్నిథాల విజిలెన్స్ డైరెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విచారణ అనంతరం వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోంమినిస్ట్రీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ నడుస్తున్న తరుణంలో, రెండు దశాబ్దాల కిందటి పాత కేసులో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కేరళం ప్రభుత్వం విచారణకు ఆదేశించడం తీవ్ర చర్చకు దారితీసింది.

#CEC gnanesh kumar#vigilence enquiry#keralam#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి