ఏపీ

AP : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

4 నిమిషాల పఠనం

ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ ఖాళీలు వెనువెంటనే భర్తీ చేస్తానని ప్రకటించిన విధంగానే కూటమి సర్కార్ వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ ఖాళీలు వెనువెంటనే భర్తీ చేస్తానని ప్రకటించిన విధంగానే కూటమి సర్కార్ వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నది. మొన్నటివరకు డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలు ప్రకటించిన ఏపీ సర్కార్ .. తాజాగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్ర పరిపాలనా విభాగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌‌‌ను (ఏపీపీఎస్‌సీ) అధికారికంగా విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 విభాగాల్లో కలిపి 166 గ్రూప్-1 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా అక్టోబర్ 06 నుంచి అక్టోబర్ 27వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని కమిషన్ కోరింది.

గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్లు (12), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (14), డీఎస్పీ సివిల్ (36), డీఎస్పీ కమ్యూనికేషన్స్ (3), డీఈవో (14), ఆర్టీవో (3), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (35), మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 (12), డిప్యూటీ రిజిస్ట్రార్ (16) వంటి అత్యున్నత హోదా కలిగిన పోస్టులు ఉన్నాయి.

పోలీస్ విభాగంలోని డీఎస్పీ పోస్టులకు వయోపరిమితిని 21-30 ఏళ్లుగా నిర్ణయించగా, ఇతర శాఖల్లోని అత్యధిక పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల వరకు అర్హత కల్పించారు. అలాగే ఉద్యోగులకు పే స్కేల్ నెలకు రూ.54,060 నుంచి గరిష్టంగా రూ.1,54,980 వరకు ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు, జోన్ల వారీగా పూర్తి ఖాళీల వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చని అధికారులు కోరారు. కాగా, గతంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారిలో కొందరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం.తద్వారా ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలని అభ్యర్థులు సీరియస్‌గా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

#Group-1 jobs#Notification#Andrapradesh#Appsc#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి