ఏపీకి రెయిన్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
వానల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు రైతులు, జనాలు. వర్షాలు కురవాలని పూజలు, యాగాలు కూడా చేస్తున్నారు. కాగా, ఎల్ నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు ముఖం చాటేశాయి. ఎక్కడా చినుకు జాడే లేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Author: NK•20 Jul 2026, 08:43 PM