Kiran: అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి.. నిద్రలోనే గుండెపోటు
కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత ఎంఏ గఫూర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గఫూర్, ఐద్వా నాయకురాలు నిర్మల కుమారుడు కిరణ్ అమెరికాలో మృతి చెందారు. కిరణ్ వయసు 41ఏళ్లు. కిరణ్ కాలిఫోర్నియాలో జాబ్ చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన నిద్రలోనే కిరణ్ కు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన చనిపోయారు. ఈ విషయం కుటుంబసభ్యులకు ఆలస్యంగా తెలిసింది.
Author: NK•10 Oct 2026, 04:05 PM