ఈసీపై ముప్పేట దాడి.. విపక్షాల తర్వాత NDAలోనూ డిమాండ్లు!
ఎన్నికల సంఘం చుట్టూ మొదలైన వివాదం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కోసం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై ఇప్పటికే విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే అంశంపై అధికార NDA కూటమిలోని కొన్ని మిత్రపక్షాలు కూడా ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరడం చర్చనీయాంశంగా మారింది.
Author: Kashi•26 Sep 2026, 09:53 AM