కార్తీక మాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్, కోడిగుడ్ల ధరలు!
తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతూ కిలో రూ.300 మార్కు వరకు పలికిన చికెన్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం సమీపిస్తుండటం, మార్కెట్లో కోడిమాంసానికి డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో వ్యాపారులు ధరలను భారీగా తగ్గించారు. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు కిలో రూ.250 పరిధికి చేరుకోవడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తోంది.
Author: Mamatha puppala•31 Oct 2026, 11:16 AM