TG: రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం ప్రభుత్వం దగ్గర ఉంది: సీఎం రేవంత్
TG: వచ్చే రెండేళ్ల పాటు రాష్ట్రంలో బియ్యం కొరత అనే మాటే వినిపించదని, ప్రజల అవసరాలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వ గోదాముల్లో సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎల్నినో ముప్పు పొంచి ఉందని, ఇక బియ్యం దొరకక ధరలు ఆకాశాన్ని తాకుతాయంటూ సాగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మూడు రోజుల పాటు కొనసాగనున్న 'పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026' ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, ఆహార భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Author: Mahesh•25 Nov 2026, 04:47 PM