సోషల్ మీడియా పవర్.. మూడేళ్ల చిన్నారి ఆవేదనకు జగిత్యాల కలెక్టర్ స్పందన!
తల్లిదండ్రులకు దూరమై శిశు సంక్షేమ గృహంలో ఆవేదన అనుభవించిన ఓ మూడేళ్ల చిన్నారి(బాబు) కన్నీటి గాథ తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది. మూడేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను దత్తత వివాదం పేరిట అధికారులు వేరు చేయడంతో, దాదాపు రెండు నెలలుగా ఆ తల్లిదండ్రులు తీవ్ర నిరీక్షణ అనుభవించారు.
Author: Mamatha puppala•03 Nov 2026, 10:43 AM