తెలంగాణ
TG: సింగిల్ విండో విధానంలో పౌల్ట్రీ పరిశ్రమకు అనుమతులు- సీఎం రేవంత్ రెడ్డి
TG: తెలంగాణలో పౌల్ట్రీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఎలాంటి జాప్యం లేకుండా 'సింగిల్ విండో విధానం' ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 'పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో' వేదికగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
Author: Mahesh•25 Nov 2026, 03:52 PM