తెలంగాణ

HYD : నేడు ‘కామన్ టికెట్’ ప్రారంభం.. ఒకే ధరకు రెండు ప్రయాణాలు

5 నిమిషాల పఠనం

‘క్యూర్’ పరిధిలో నేటి నుంచి కామన్ టికెట్ అందుబాటులోకి రానుంది. ప్రయాణిలకు మెరుగైన రవాణా కోసం ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడంతో పాటు హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యంతో రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌ను టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

‘క్యూర్’ పరిధిలో నేటి నుంచి కామన్ టికెట్ అందుబాటులోకి రానుంది. ప్రయాణిలకు మెరుగైన రవాణా కోసం ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడంతో పాటు హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యంతో రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌ను టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగతి భవన్‌లో ఇవాళ ప్రారంభించనున్నారు.

ఆర్టీసీ బస్సు, మెట్రో సేవలను అనుసంధానించే ఉమ్మడి ప్రయాణ సౌకర్యం కోసం డిజిటల్ పాస్‌ను తీసుకురానున్నారు. హైదరాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీ రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. మెట్రో రైల్ మూడు కారిడార్లలో రోజుకు సుమారు 4.50 లక్షల మందిని చేరవేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు సేవలను మరింత సులభతరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కామన్ టికెట్’ను ఉమ్మడి పాస్‌ను తీసుకురానుంది.

ఈ పాస్‌ను అన్ని మెట్రో స్టేషన్లలో జారీ చేయనున్నారు. ఒకే పాసుతో ఓఆర్ఆర్ లోపల నడిచే అన్నిరకాల ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ మినహా), మెట్రో రైల్స్‌లోనూ ప్రయాణించవచ్చు. ఒక టికెట్‌తో మెట్రో, ఆర్టీసీలో ప్రయాణం చేయచ్చు.వేర్వేరు టికెట్లు అవసరం లేదు. పాసులు కూడా అవసరం లేదు.కామన్ టికెట్ (మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్) కొనుగోలు చేసేటప్పుడు రూ.100 వసూలు చేయనున్నారు.

ఒకే పాసుతో బస్సు, మెట్రోల్లో ఇబ్బంది లేని ప్రయాణం చేయడానికి చాన్స్ ఉంది.తరచూ ప్రయాణించేవారికి మొత్తం ప్రయాణ ఖర్చూ తగ్గనుంది. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచే నివాస, వాణిజ్య ప్రాంతాలకు మెరుగైన చివరి మైలు అనుసంధానం చేయనున్నారు.సమగ్ర ప్రజారవాణా వినియోగం పెరగడం వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం తగ్గనున్నాయని అధికారులు చెబుతున్నారు.

సిటీ బస్సులలో ప్రయాణించే ప్యాసింజర్లకు కాగితపు టికెట్ల ఇబ్బందులు తప్పించేందుకు ‘మీ టికెట్’ యాప్ ద్వారా ఓపెన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ ద్వారా యాప్ లోనే తాము బస్సు ఎక్కే ప్రదేశం నుంచి గమ్యస్థానంతోపాటు, టికెట్ రకాన్ని ఎంచుకుని, డిజిటల్ విధానంలో సులభంగా చెల్లించడానికి చాన్స్ ఉంది.

రోజువారీ ప్రయాణికుల కోసం ‘మీ టికెట్’ యాప్‌లో ప్రత్యేక డిజిటల్ వీక్లీ బస్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ధర రూ.600గా నిర్ణయించారు. ఈ విధానం ద్వారా ప్రయాణికులు ఇకపై బస్ పాస్ సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా నేరుగా యాప్ నుంచే రూ.600 వీక్లి పాస్ కొనుగోలు చేయవచ్చు.ఈ పాస్ ద్వారా వారం రోజుల పాటు అన్ని బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు.

పాసు వివరాలు ఇలా ఉన్నాయి. డైలీ పాస్(ఆర్టీసీ) రూ.100, మెట్రో చార్జీ డైలీ పాస్ రూ.300.. రెండు కలిపి రూ.400 చెల్లిస్తే ఒక రోజులో అపరిమితంగా ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణం చేయొచ్చు. ఇక మంత్లీపాస్ ఆర్టీసీకి రూ.1500, మెట్రోకు రూ.7000 రెండు కలిపితే నెలవారీగా రూ.8,500 చెల్లిస్తే మెట్రో, ఆర్టీసీలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు.

#Hyderabad#metro#tgsrtc#services#common ticket#mobile app#launch today#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి