జాతీయం

EPFO: శాలరీ అకౌంట్‌పై పీఎఫ్ బాంబ్.. చేతికి వచ్చేది ఇంతేనా?

5 నిమిషాల పఠనం

EPFO: నెల తిరిగేసరికి జీతం పడిందని మొబైల్‌కు వచ్చే శాలరీ క్రెడిట్ మెసేజ్ చూసి ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఎందుకు షాక్ అవుతున్నారని అనుకుంటున్నారు.. ఎప్పటిలా కాకుండా ఈసారి చేతికి వచ్చే జీతంలో భారీగా కోత పడటంతో దానికి కారణం. అసలు ఏం జరిగిందంటే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వేతన పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే ఈ కోతకు ప్రధాన కారణం.

EPFO: నెల తిరిగేసరికి జీతం పడిందని మొబైల్‌కు వచ్చే శాలరీ క్రెడిట్ మెసేజ్ చూసి ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఎందుకు షాక్ అవుతున్నారని అనుకుంటున్నారు.. ఎప్పటిలా కాకుండా ఈసారి చేతికి వచ్చే జీతంలో భారీగా కోత పడటంతో దానికి కారణం. అసలు ఏం జరిగిందంటే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వేతన పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే ఈ కోతకు ప్రధాన కారణం. ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ పెరగడంతో అక్టోబర్ నెల నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఒక్కసారిగా తగ్గిపోయింది.

జీతంలో కోత ఎలా పడింది..

సాధారణంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ నుంచి 12 శాతం మొత్తం పీఎఫ్ ఖాతాకు కట్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం వేజ్ సీలింగ్ రూ.15,000 మాత్రమే ఉండేది. అంటే ప్రతినెలా గరిష్టంగా రూ.1,800 మాత్రమే పీఎఫ్ కింద కట్ అయ్యేది. తాజాగా కేంద్రం ఈ వేతన పరిమితిని రూ.25,000కు పెంచింది. దీంతో 12 శాతం లెక్కన ప్రతినెలా కట్ అయ్యే మొత్తం ఏకంగా రూ.3,000కు చేరింది. దీంతో ప్రతి ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా అదనంగా మరో రూ.1,200 కట్ అవుతోంది. అంటే ఏడాదికి ఉద్యోగి చేతికి వచ్చే ‘టేక్ హోమ్ శాలరీ’లో నేరుగా రూ.14,400 వరకు గండి పడుతోంది. ఈ అదనపు కటింగ్‌తో అక్టోబర్ శాలరీ క్రెడిట్ మెసేజ్ చూసిన ఉద్యోగులు తమ అకౌంట్లలో డబ్బులు ఎందుకు తగ్గాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

రిటైర్మెంట్‌కు జాక్‌పాట్..

ప్రస్తుతానికి చేతికొచ్చే జీతం తగ్గినా, లాంగ్ రన్‌లో ఇది ఉద్యోగులకు గొప్ప వరమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతినెలా పీఎఫ్ అకౌంట్‌కు ఎక్కువ మొత్తం జమ కావడం వల్ల, చక్రవడ్డీ రూపంలో రిటైర్మెంట్ నాటికి భారీ నిధి ఏర్పడుతుందని అంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ అదనపు పొదుపు రక్షణ కవచంలా పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే పీఎఫ్ కింద జమ అయ్యే డబ్బును భవిష్యత్‌లో విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈపీఎస్ కింద పెన్షన్ కోసం వెళ్లే మొత్తాన్ని మాత్రం ఉద్యోగంలో ఉండగా విత్‌డ్రా చేయడం కుదరదు.

సమస్యలుంటే వెంటనే సెట్ చేసుకోండి..

కొత్త రూల్స్ నేపథ్యంలో ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్స్‌ను మరింత అప్రమత్తంగా చెక్ చేసుకోవాల్సి ఉంది. గతంలో పని చేసిన పాత కంపెనీల నుంచి పీఎఫ్ బదిలీ కాకపోవడం, సర్వీస్ ముగిసిన తర్వాత కూడా ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ అప్‌డేట్ కాకపోవడం, ఆన్‌లైన్ క్లెయిమ్‌లు రిజెక్ట్ కావడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. పెరిగిన కటింగ్‌ల దృష్ట్యా, పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను ప్రస్తుత ఖాతాకు త్వరగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని, యజమాన్యాలతో ఉన్న క్లెయిమ్ సమస్యలను రూల్స్ ప్రకారం వెంటనే పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

#EPFO#Employees Provident Fund Organisation#EPF#PF#PF Wage Ceiling#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి