తెలంగాణ

నోరు జారితే ఊరుకునేది లేదు.. ఆడవాళ్లతో కొట్టిస్తా- కొండా సురేఖ మాస్ వార్నింగ్

5 నిమిషాల పఠనం

Konda Surekha: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయారు. తనను, తన వర్గాన్ని విమర్శించే రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారామె. మా జోలికి రావొద్దు.. జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలతో కొట్టిస్తామని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు.

Konda Surekha: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయారు. తనను, తన వర్గాన్ని విమర్శించే రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారామె. మా జోలికి రావొద్దు.. జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలతో కొట్టిస్తామని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు.

మా వాళ్లపై ఈగ వాలినా ఊరుకోను

కొంతమంది నేతల తీరుపై కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతలు హద్దులు మీరుతున్నారన్న కొండా సురేఖ.. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. తమ ముందు కుప్పిగంతులు వేస్తే చూస్తూ ఊరుకోము అన్నారు. ఇక ముందు కొండా దంపతులకు సంబంధించిన వ్యక్తుల మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తా

తమ గురించి ఇష్టానుసారం మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామన్నారు. మా వర్గంలోని అడవాళ్లే చాలు, మగవాళ్లు కూడా అవసరం లేదన్నారు. ఒక్కో మహిళ నలుగురిని కొడుతుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. మా గురించి తప్పుగా మాట్లాడితే ఎక్కడ దొరికితే అక్కడ చిత్తుచిత్తుగా కొడతారని చెప్పారు. ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పుతున్నారంటూ ధ్వజమెత్తారు కొండా సురేఖ.

వర్గ విభేదాలను పక్కన పెట్టండి

కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలపైనా కొండా సురేఖ స్పందించారు. కాంగ్రెస్ నేతలంతా వర్గ విభేదాలను పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులంతా ఐక్యంగా ఉంటేనే పార్టీ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్ కు సూచించారు.

మంత్రి పదవి పోవటం బాధగా లేదు

మంత్రి పదవి పోవటంపైనా కొండా సురేఖ స్పందించారు. మంత్రి పదవి పోవటం తనకు బాధగా లేదని చెప్పారు. మంత్రిగా ఉంటే రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అవకాశం తనకు ఉండేదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోయానన్నారు. ఇప్పుడు వరంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించి అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఇకపై నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలవడమే తమ లక్ష్యమన్నారు.

బీఆర్ఎస్ పాలనలో ఎంజీఎంకు ఏం చేశారు?

కొంతమంది ఎంజీఎం సందర్శన పేరుతో హడావిడి చేశారని కొండా సురేఖ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎంజీఎంకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఇక, కొత్త కలెక్టరేట్ దగ్గర బీజేపీ నాయకులు నిరసన తెలిపి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.

వరంగల్‌లో పురాతన ప్రదేశాలను అభివృద్ధి చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాకే మాట్లాడాలన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేవాలయాలకు నిధులు కేటాయించామని గుర్తు చేశారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేస్తామని కొండా సురేఖ ప్రకటించారు. ఇకపై వారంలో ఒక రోజు ఒక డివిజన్ లో తన పర్యటన ఉంటుందన్నారు.

#Konda Surekha#Brs#Telangana Congress#Konda Surekha Warning#Warangal#Bjp#MGM#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి