క్రైమ్

Bollaram: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు అరెస్ట్

4 నిమిషాల పఠనం

Bollaram: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ మల్లేష్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

Bollaram: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ మల్లేష్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్మీ ఆయుధాగారం (ఆర్మరీ) ఇంచార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషు.. ఆయుధాల చోరీలో మల్లేష్‌కు సహకరించినట్లు విచారణలో తేలింది. అంతేకాదు మల్లేష్‌, ఆ ఇద్దరి మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సైతం సేకరించినట్లు సమాచారం. దీంతో వెపన్స్‌ గోడౌన్‌ కీపర్లు వినోద్‌, శేషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కలకలం

సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న బొల్లారం పోలీసులు లోతుగా దర్యాఫ్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న మల్లేష్‌ను అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. మల్లేశ్ విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు.

మల్లేష్‌కు ఆర్మరీ ఇంచార్జ్‌ల సహకారం

వెపన్స్ చోరీకి సంబంధించి మల్లేష్ ఇద్దరి సహకారం తీసుకున్నట్లుగా తేలింది. మద్రాస్ రెజిమెంట్ లోపల ఆయుధాలు భద్రపరిచే గదికి ఇంచార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషు.. వెపన్స్ చోరీలో మల్లేష్‌కు సహకరించారు. ఆగస్టు 28, 29వ తేదీన రెక్కీ నిర్వహించిన మల్లేష్.. 30వ తేదీన రాత్రి ఆయుధాల చోరీకి పాల్పడ్డాడు. 12 ఆయుధాలు, బుల్లెట్లు దొంగిలించి తన ఇంట్లో దాచాడు. మల్లేశ్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

మరోవైపు 10 రోజుల కస్టడీలో భాగంగా మల్లేష్ ను 8వ రోజు విచారించారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం మల్లేష్‌ను మద్రాస్‌ రెజిమెంట్‌కు తీసుకెళ్లారు. ఆయుధాలను ఏ విధంగా బయటకు తీసుకురాగలిగాడు, ఎలా తరలించాడు అనే అంశాలను తెలుసుకుంటున్నారు.

#Bollaram#Bollaram Army Weapons Theft Case#Secunderabad#Madras Regiment#Hyderabad Army Weapons Theft Case#Mallesh#Swechaa News#Bollaram Arms Theft
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి