ఏపీ

TTD : హాలిడేస్ ఎఫెక్ట్.. శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

4 నిమిషాల పఠనం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.వరుసగా సెలవులు రావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో శ్రీవారి హుండీకి నిధుల వరద ప్రవాహం కొనసాగింది. గత 9 నెలల వ్యవధిలోనే స్వామి వారి హుండీకి రూ.1,129.04 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

దేశవిదేశాల నుంచి విచ్చేసిన లక్షలాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో స్వామి వారి మీద అనంత భక్తితో హుండీలో కానుకలను సమర్పించారు. సమ్మర్ హాలిడేస్, పండుగల సెలవులు కలిసి రావడంతో గత కొన్ని నెలలుగా హుండీ ఆదాయం నిరంతరాయంగా సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. జూలై నెలలో టీటీడీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో అత్యధికంగా రూ.140.25 కోట్ల కానుకలు రావడం విశేషం.

మిగిలిన నెలల్లోనూ శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురిసింది. జూన్‌లో రూ.128.30 కోట్లు, ఆగస్టులో రూ.137.44 కోట్లు రాగా, ఇటీవల ముగిసిన సెప్టెంబర్ నెలలో రూ.126.41 కోట్ల ఆదాయం సమకూరింది. సెప్టెంబర్ 10న ఒక్కరోజే ఏకంగా రూ.6.94 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం రావడం టీటీడీ చరిత్రలోనే నాలుగో అత్యధిక రోజువారీ ఆదాయంగా నిలిచింది.

భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో స్వామివారి దర్శనాలతో పాటు లడ్డూ ప్రసాదాల విక్రయాలు, వసతి, ఆర్జిత సేవల ద్వారా వచ్చే ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధి నమోదవుతోందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించే ప్రతి పైసాను పారదర్శకంగా స్వామి వారి సేవలు, ధార్మిక కార్యక్రమాలు, భక్తుల మౌలిక వసతుల కల్పన కోసమే వినియోగిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, తలనీలాల ద్వారా సమకూరిన ఆదాయ వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

#TTD#Tirumala#Record level income#hundi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి