క్రైమ్

UP : చెప్పుల విషయంలో గొడవ ఎంత పని చేసింది!

4 నిమిషాల పఠనం

చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం లేదా తీయడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. కూర్చుని మాట్లాడుకుంటే సర్దుమణికే విషయాల్లో కొందరు గొడవకు తావిస్తున్నారు.అది కాస్త ఇద్దరి మధ్య ఎనలేని దూరాన్ని,ఆగ్రహావేశాలను పెంచుతోంది.

చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం లేదా తీయడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. కూర్చుని మాట్లాడుకుంటే సర్దుమణికే విషయాల్లో కొందరు గొడవకు తావిస్తున్నారు.అది కాస్త ఇద్దరి మధ్య ఎనలేని దూరాన్ని,ఆగ్రహావేశాలను పెంచుతోంది.ఫలితంగా సహనం కోల్పోయిన అవతలి వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలు ఆగం అవుతున్నాయి. పిల్లలు తల్లి లేదా తండ్రిని కోల్పోతున్నారు. కొన్నికుటుంబాలు ఇంటి పెద్దను సైతం కోల్పోతున్నాయి.

తాజాగా చెప్పుల విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ ఇంటి పెద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్యభర్తల మధ్య గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని నిరాలినగర్‌లో గల బ్లాసమ్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. సందీప్ సింగ్(47) ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకొని గదిలోకి రావడంతో భర్తను.. భార్య కంచన్ నిలదీసింది. బెడ్రూంలోకి బాత్రూం స్లిప్పర్స్ ఎలా వేసుకొచ్చాడని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దగా అయ్యింది. ఈ గొడవ ముదరడం.. భార్య అవమానకరంగా మాట్లాడిందని సందీప్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

దాంతో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఛాతిపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సందీప్‌కు ఇది రెండో పెళ్లిగా తెలుస్తోంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక 2019లో కంచన్‌ను పెళ్లి చేసుకోగా.. వీరికి నాలుగేళ్ల కుమార్తెతో పాటు రెండు నెలల కుమారుడు ఉన్నారు.కాగా, సందీప్ మరణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#slippers#wife#husband#suicide#UP#Crime#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి