వైరల్ న్యూస్

Viral : సౌండ్ ఎక్కువ పెట్టాడని.. పూజారిపై పిడిగుద్దులు

4 నిమిషాల పఠనం

ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ వాడకం వలన కొందరు చిరాకు పడుతున్నట్టు తెలుస్తోంది. వినాయక చవితి నిమజ్జనాల సమయంలో డీజే శబ్దాలకు కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. రాత్రింబవళ్లు డీజే సౌండ్స్ వలన చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి.

ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ వాడకం వలన కొందరు చిరాకు పడుతున్నట్టు తెలుస్తోంది. వినాయక చవితి నిమజ్జనాల సమయంలో డీజే శబ్దాలకు కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. రాత్రింబవళ్లు డీజే సౌండ్స్ వలన చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గుండె జబ్బులు ఉన్న వారైతే డీజే సౌండ్స్‌కు దూరంగా రాత్రులు గడిపినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే లౌడ్ స్పీకర్లో భక్తి సాంగ్స్ పెట్టాడని, సౌండ్ తగ్గించడం లేదని ఇద్దరు వ్యక్తులు ఓ పూజారిని చితకబాదారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లోని గణేశ్‌నగర్ మెయిన్‌ రోడ్ వద్దగల శివాలయంలో చోటుచేసుకుంది. పెద్ద సౌండ్‌తో పండిట్ రామకృష్ణ భక్తి పాటలు పెట్టడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది.

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సుమారు 7:45 గంటల సమయంలో పూజ సమయంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆలయంలో పెద్ద శబ్దంతో భక్తి పాటలు, హారతి ఇస్తుండగా.. పక్కనే ఉండే కొందరు యువకులు శబ్దం ఎక్కువగా ఉందని అభ్యంతరం తెలిపారు. అది కాస్త పూజారి పండిట్ రామకృష్ణ, ఆ యువకుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మాటామాటా పెరగడంతో నిందితులు పూజారిని కిందకు తోసేసి, పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లతో తన్నారు.

ఈ దృశ్యాలు ఆలయ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి సమయంలో ఆలయంలో ఉన్న చిన్నారులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, భక్తులు జోక్యం చేసుకుని పూజారిని రక్షించారు.అనంతరం పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు హరీశ్ చతుర్వేది, దేవాన్ష్‌లను అరెస్టు చేశారు. మరోవైపు నిందితుల కుటుంబం కూడా ప్రతి ఫిర్యాదు (క్రాస్ ఎఫ్‌ఐఆర్) నమోదు చేసినట్టు సమాచారం.ఈ దాడిని ఖండిస్తూ స్థానికులు, పూజారి కుటుంబ సభ్యులు కర్ధాని పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.

#worship#priest#rajastan#viral#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి