తెలంగాణ

Congress : ఈసీ మోసం వల్లే ఆర్జేడీ, టీఎంసీ పార్టీల ఓటమి : టీపీసీసీ చీఫ్

4 నిమిషాల పఠనం

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వైఖరితో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు.ప్రపంచ దేశాలలు భారత్ తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు.

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వైఖరితో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు.ప్రపంచ దేశాలలు భారత్ తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సూచనలతో ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ బీజేపీకి తొత్తుగా మారి, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ తీరుతో ఓటర్ల భవిష్యత్ రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణ మ్యానిపులేట్ అయ్యేలా జరుగుతోందని విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తీరుపై తోటి అధికారులే తీవ్ర అసంతృప్తితో లబోదీబో మంటుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. పేర్కొన్నారు.

బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి వెనుక ఎలక్షన్ కమిషన్ మోసపూరిత వైఖరి ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్ గెలవాల్సిన సీటును కుట్రపూరితంగా చోరీ చేశారని ధ్వజమెత్తారు. ఓట్ల అక్రమాల ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ అక్రమాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

ఓటు చోరీకి సీఈసీ జ్ఞానేష్ కుమార్ కారకుడు అని ఆరోపించడంతో పాటు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎంపీలు వివేక్ వెంకటస్వామి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణలతో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

#CES gnanesh kumar#resignation#demand#congress#protests#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి