వ్యాపారం

RBI : బాంబు పేల్చిన ఆర్బీఐ.. పెరగనున్న రుణాల వడ్డీ రేట్లు!

4 నిమిషాల పఠనం

సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో అల్లాడుతున్న ప్రజలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) మరో భారం మోపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు ఇంతకాలం తటస్థంగా ఉండగా, ఇప్పుడు పెరగనున్నాయి. చాలిచాలనీ వేతనాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి, పేదప్రజలకు తాజా ఆర్బీఐ నిర్ణయం పెనుభారంగా మారనుంది.

సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో అల్లాడుతున్న ప్రజలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) మరో భారం మోపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు ఇంతకాలం తటస్థంగా ఉండగా, ఇప్పుడు పెరగనున్నాయి. చాలిచాలనీ వేతనాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి, పేదప్రజలకు తాజా ఆర్బీఐ నిర్ణయం పెనుభారంగా మారనుంది.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో 3 రోజుల పాటు జరిగిన ఎంపీసీ ద్వైమాసిక సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఉదయం వెల్లడించారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా ‘రెపో రేటు’ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 5.25 శాతంగా ఉన్న రెపోరేటు 5.5 శాతానికి పెరిగింది. దేశంలో ఆహార, సేవా రంగాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్లో అస్థిరతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువపై పడిపోతున్న క్రమంలో ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.

అయితే, రెపోరేటు పెంపు ప్రభావం నేరుగా బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ పెరగనున్నాయి. వాణిజ్య బ్యాంకులు కూడా తమ లెండింగ్ రేట్లను (MCLR/EBLR) పెంచే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికే ఇళ్ల రుణాలు, వ్యక్తిగత, వాహన రుణాలు తీసుకున్న సామాన్యుల నెలవారీ ఈఎంఐ (EMI) భారం మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇకమీదట కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి వడ్డీ రేట్లు మరింత ప్రియం కానున్నాయి.కాగా, మరోవైపు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) చేసుకునే డిపాజిటర్లకు, సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ రేట్లు పెరిగి స్వల్ప ఊరట లభించనుందని తెలుస్తోంది. పండుగల సీజన్ ముంగిట ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలపై ఒకింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అన్నిరకాల వస్తువులు, కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగడం, రుణాల మీద వడ్డీ రేట్లు పెరగడం, జాబ్ మార్కెట్‌, వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతుండటంతో ఈసారి కొనుగోళ్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

#RBi#Bak loans#intrest hike#Reporate#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి