తెలంగాణ

TG: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. ప్రైవేట్ హోటల్‌లో 25 మంది డీసీసీ అధ్యక్షుల సీక్రెట్ మీటింగ్!

TG: అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లాల్లో తమకు కనీస గౌరవం దక్కడం లేదంటూ ఏకంగా 25 మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏకమై హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో 25 మంది డీసీసీ అధ్యక్షులు ప్రత్యేకంగా సమావేశమై తమ అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న తమను సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలే పక్కన పెడుతున్నారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.