తెలంగాణ

RajaSingh Controversial Speech: భవిష్యత్‌లో దేశంలో పెను ప్రమాదం.. లైసెన్స్‌డ్ తుపాకులు కొనుక్కోండి: రాజాసింగ్

 భవిష్యత్తులో దేశంలో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే భద్రతా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పద్ధతులను అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చట్టప్రకారం తగిన అనుమతులు పొంది ప్రతి హిందువు తప్పనిసరిగా లైసెన్స్‌డ్ తుపాకీని దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా నానాటికీ గణనీయంగా పెరిగిపోతోందని రాజాసింగ్ తన వీడియో సందేశంలో ప్రస్తావించారు.