తెలంగాణ

Harish Rao : శూన్యహస్తంగా మారిన ‘అభయహస్తం’ : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధపు హామీలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ‘అభయహస్తం’ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయిందని, నేటికీ హామీల అమలు పూర్తి చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించుకున్న అభయహస్తం హామీలను అమలు చేయని మొండి హస్తంగా, శూన్య హస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల కిందట ఇదే రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి గుర్తుచేశారు.