తెలంగాణ
మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలం
ACB Raids: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. లంచం తీసుకుంటూ రెండు నెలల క్రితం ప్లానింగ్ ఆఫీసర్ వాణి పట్టుబడ్డారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణలో కీలక విషయాలు రాబట్టారు అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో గుండు వాణి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వాణికి చెందిన స్థిర, చరాస్తులపై ఆరా తీశారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు.
