National
Adani Group: మరో చిక్కుల్లో అదానీ.. మహారాష్ట్ర ప్రాజెక్ట్ లెక్కల్లో ఏం జరిగింది?
Adani Group: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది. మహారాష్ట్రలో చేపట్టబోయే ఒక భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ఖర్చును ఏకంగా వంద రెట్లు తగ్గించి చూపించారన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ నిబంధనల కింద చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల సొమ్మును ఎగ్గొట్టేందుకే ఇలా లెక్కలు మార్చారన్న విమర్శలు రావడంతో, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర పర్యావరణ శాఖ విచారణకు ఆదేశించాయి.మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 'తారాలి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్'ను అదానీ గ్రీన్ ఎనర్జీ చేపడుతోంది. 2025 ఫిబ్రవరి 11న ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతుల లేఖలో మొత్తం వ్యయం రూ. 5,675 కోట్లు అని స్పష్టంగా రాసి ఉంది.
