క్రైమ్

custodial death : తెలంగాణలో మరో లాకప్ డెత్?

వరంగల్ జిల్లాకు చెందిన వరుణ్ జడ్చర్లలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వరుణ్ తాను పనిచేస్తున్న లాడ్జి నుంచి ఒక ల్యాప్‌టాప్, సుమారు రూ.32వేల నగదుతో పరారయ్యాడని లాడ్జి యజమాని శ్రీకాంత్ ఆదివారం ఉదయం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లాడ్జి యజమాని, సిబ్బంది గాలించగా అదే మధ్యాహ్నం బాలానగర్‌లో వరుణ్ దొరికాడు. వెంటనే అతడిని తీసుకొచ్చి జడ్చర్ల పోలీసులకు అప్పగించారు. అయితే పీఎస్‌లో ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురైన వరుణ్.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.