ఏపీ
AP State Festival Announcement: ఏపీ రాష్ట్ర పండుగగా ‘సత్యసాయి బాబా జయంతి’.. నారా లోకేశ్ ప్రకటన!
ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని ఇకపై అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23వ తేదీన సత్యసాయి బాబా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఈ కీలక విషయాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సత్యసాయి బాబా చూపిన సేవా మార్గాన్ని, విలువలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
