National
National : ప్రతీకారం తీర్చుకున్న ఆర్మీ.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా (LeT) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గత వారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం. కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
