జాతీయం

National : ప్రతీకారం తీర్చుకున్న ఆర్మీ.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

3 నిమిషాల పఠనం

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LeT) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గత వారం సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం.

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LeT) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గత వారం సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం.

కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఆర్మీ, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌తో పాటు అతడి అనుచరుడు ఉన్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో ఆర్మీ బలగాలు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు అక్కడ నక్కి ఉన్నట్టు పోలీసు, ఆర్మీ బలగాలు అనుమానిస్తున్నాయి. సమీపంలోని ఆర్మీ యూనిట్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG) బలగాలు ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, గత బుధవారం కుల్గామ్‌లోని మిర్ బజార్ సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ 46వ బెటాలియన్ క్యాంపుపై మోటార్ సైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు మెరుపుదాడి చేసి ముగ్గురు జవాన్లను గాయపరిచిన విషయం తెలిసిందే. నాటి నుంచి టెర్రరిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు.. ఇవాళ ఉదయం వారిని ఎన్ కౌంటర్ చేశాయి. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నిఘాను సైతం టైట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

#terroists#encounter#jammukashmeer#national#CRPF camp#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి