తెలంగాణ

Bharat Summit: భారత్ సమ్మిట్ బూమరాంగ్ అవుతుందా? కమలం పార్టీ కొత్త ప్లాన్ ఇదేనా!

Bharat Summit: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఒక సదస్సు, ఆ పార్టీకే తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జరిపిన ‘భారత్ సమ్మిట్’ ఇప్పుడు కొత్త రాజకీయ మంటలకు కేంద్రబిందువుగా మారింది. మోడీ సర్కార్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు గుప్పించడానికి కాంగ్రెస్ ఈ వేదికను వాడుకోవాలని చూస్తే.. ఇప్పుడు అదే సమ్మిట్‌లో జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బీజేపీ రివర్స్ గేమ్ మొదలుపెట్టింది. అసలు కాంగ్రెస్ ప్లాన్ బూమరాంగ్ అయ్యేలా కమలం పార్టీ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటంటే..ఈ మొత్తం వివాదానికి ఆ సభలో కొందరు విదేశీ ప్రతినిధులు చేసిన కామెంట్స్ ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా ఒక విదేశీ ప్రతినిధి వేదికపై నుంచి "ఓట్ చోర్ - గద్దె చోడ్" అంటూ భారత ప్రభుత్వంపై చేసిన విమర్శలు బీజేపీ చేతికి బలమైన ఆయుధంగా చిక్కాయి. మన దేశ అంతర్గత రాజకీయాలపై విదేశీయులతో విమర్శలు చేయించడమేంటని, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ వేదిక కల్పిస్తోందని ఆరోపిస్తూ కమలనాథులు ఎదురుదాడికి దిగారు.