తెలంగాణ

Bharat Summit: భారత్ సమ్మిట్ బూమరాంగ్ అవుతుందా? కమలం పార్టీ కొత్త ప్లాన్ ఇదేనా!

4 నిమిషాల పఠనం

Bharat Summit: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఒక సదస్సు, ఆ పార్టీకే తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జరిపిన ‘భారత్ సమ్మిట్’ ఇప్పుడు కొత్త రాజకీయ మంటలకు కేంద్రబిందువుగా మారింది.

Bharat Summit: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఒక సదస్సు, ఆ పార్టీకే తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జరిపిన ‘భారత్ సమ్మిట్’ ఇప్పుడు కొత్త రాజకీయ మంటలకు కేంద్రబిందువుగా మారింది. మోడీ సర్కార్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు గుప్పించడానికి కాంగ్రెస్ ఈ వేదికను వాడుకోవాలని చూస్తే.. ఇప్పుడు అదే సమ్మిట్‌లో జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బీజేపీ రివర్స్ గేమ్ మొదలుపెట్టింది. అసలు కాంగ్రెస్ ప్లాన్ బూమరాంగ్ అయ్యేలా కమలం పార్టీ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటంటే..

ఈ మొత్తం వివాదానికి ఆ సభలో కొందరు విదేశీ ప్రతినిధులు చేసిన కామెంట్స్ ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా ఒక విదేశీ ప్రతినిధి వేదికపై నుంచి "ఓట్ చోర్ - గద్దె చోడ్" అంటూ భారత ప్రభుత్వంపై చేసిన విమర్శలు బీజేపీ చేతికి బలమైన ఆయుధంగా చిక్కాయి. మన దేశ అంతర్గత రాజకీయాలపై విదేశీయులతో విమర్శలు చేయించడమేంటని, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ వేదిక కల్పిస్తోందని ఆరోపిస్తూ కమలనాథులు ఎదురుదాడికి దిగారు.

కేవలం మాటల దాడితో ఆగకుండా, బీజేపీ ఈ విషయంలో న్యాయపరమైన, అధికారిక చర్యలకు కూడా శ్రీకారం చుట్టింది. 'ఓట్ చోర్' వ్యాఖ్యలు చేసిన విదేశీ ప్రతినిధిపై ఇప్పటికే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భారత చట్టాలను ఉల్లంఘిస్తూ మాట్లాడే ఏ విదేశీ ప్రతినిధికీ మినహాయింపు ఉండదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం గట్టిగా హెచ్చరిస్తోంది.

మరోవైపు, ఆ విదేశీ ప్రతినిధి విమర్శలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టడాన్ని బీజేపీ సోషల్ మీడియా విభాగం వైరల్ చేస్తోంది. "దేశాన్ని అవమానిస్తుంటే చప్పట్లు కొడతారా?" అంటూ జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే రాష్ట్ర బీజేపీ నేతలు ఈ విషయంలో ఇంత దూకుడుగా వెళ్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి, సొంత గడ్డపై తమ బలాన్ని చాటుకోవడానికి కాంగ్రెస్ పెట్టిన ఈ సమ్మిట్.. ఇప్పుడు బీజేపీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అస్త్రంగా మారడం ఆసక్తికరంగా మారింది.

#Bharat Summit#Telangana Politics#Congress#BJP#Rahul Gandhi#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి