National
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. 17 ఏళ్ల జైలు తర్వాత ఇద్దరు దోషులకు బెయిల్!
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దాదాపు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన బిపిన్చంద్ జోషి, ప్రదీప్ రామన్లాల్లకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారిని తక్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.2017లో బాంబే హైకోర్టు తమకు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
