BJP : తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ.. నిధుల్లో భారీ కోత!
తెలంగాణలో అధికారంలోకి వస్తామని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, రాష్ట్ర కమలం నేతలు పదే పదే డప్పులు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రం మీద చూపిస్తున్న కపట ప్రేమ తేటతెల్లం అయ్యింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, జీఎస్టీ పరిహార గ్రాంట్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిసింది. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే రాష్ట్రానికి పెద్దగా ఎలాంటి ప్రయోజనం చేకూరినట్టు కనిపించడం లేదని పేర్కొంటున్నారు.రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లే మొత్తంలో సగం కూడా కేంద్రం నుంచి తిరిగి రావడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలంటే గౌరవం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల వలే సమానంగా అభివృద్ధి చేస్తామని పదే పదే చెప్పుకునే ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
