తెలంగాణ

ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేరు.. వందల కోట్లతో సమ్మిట్లా?

Errolla Srinivas: రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులు.. వందల కోట్లతో సమ్మిట్లు పెడుతున్నారని మండిపడ్డారు. మెటా సంస్థపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేస్తారు.. మళ్లీ పెట్టుబడులు అంటూ గ్లోబల్ సమ్మిట్ల పేరుతో హడావిడి చేస్తారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలపై ఇష్టం ఉన్నట్లు దాడులు చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తాయి? అని ఆయన నిలదీశారు. గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు.. కానీ, అది గోబెల్స్ సమ్మిట్ అని విరుచుకుపడ్డారు.