తెలంగాణ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతి కలకలం.. CBI ముమ్మర దర్యాఫ్తు
CBI: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతి ఆరోపణల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి ఫిర్యాదులు అందాయి. దాంతో సీబీఐ రంగలోకి దిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అక్రమాలపై విచారణ చేస్తోంది సీబీఐ. అవినీతిపై కంటోన్మెంట్ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో కొందరు ఫిర్యాదుదారులు కోర్టులను ఆశ్రయించారు. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారం రోజులుగా సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
