Cm chandrababu : ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని మామిడికుదురు మండలం, నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద గల ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ విషయం మీడియాలో రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.గ్యాస్ లీకేజీ జరిగిన సమీప ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కోనసీమలో ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష జరపాలని, ఈ విషయంపై ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో వెంటనే మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.
