ఏపీ

Cm chandrababu : ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీపై చంద్రబాబు ఆగ్రహం

4 నిమిషాల పఠనం

ఏపీలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని మామిడికుదురు మండలం, నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద గల ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది.

ఏపీలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని మామిడికుదురు మండలం, నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద గల ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ విషయం మీడియాలో రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..

గ్యాస్ లీకేజీ జరిగిన సమీప ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కోనసీమలో ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష జరపాలని, ఈ విషయంపై ఓఎన్‌జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో వెంటనే మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు పంపారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో కొనసీమ జిల్లా యంత్రాంగం వెంటనే యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది.ప్రమాద స్థలం నుంచి కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత శిబిరాలకు తరలించారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ ఉపకరణాలు వాడొద్దని స్థానికులను హెచ్చరించారు. ఈ ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ONGC అధికారులు సైతం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని, బావి హెడ్ సురక్షితంగానే ఉందని ధ్రువీకరించారు.

గ్యాస్ భూమి నుంచి ఉబికి వస్తున్నందున డీజిల్ జనరేటర్లు, ఇతర యంత్రాలను నిలిపివేసి అత్యవసరం లేని సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని, నాలుగు నుంచి 5 గంటల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.

#ONGC Gas leak#cm chandrababu naidu#andrapradesh#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి