International
China Summit: కిమ్ జాంగ్ ఉన్‌తోనూ ట్రంప్ భేటీ? దౌత్య చరిత్రలోనే చైనాలో అరుదైన ఘట్టం!
China Summit: అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన పరిణామాలకు చైనా వేదిక కాబోతోంది. చైనాలోని షెన్జెన్ నగరంలో నవంబర్ 18, 19 (ఈ రోజు, రేపు) తేదీల్లో జరగనున్న 33వ అపెక్ ఆర్థిక నేతల సదస్సు సందర్భంగా అగ్రరాజ్యాల అధినేతల కలయిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చారిత్రాత్మక త్రైపాక్షిక సమావేశానికి రంగం సిద్ధమవుతుండగా.. మరోవైపు ఇదే పర్యటనలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో కూడా ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
